బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు

బీటింగ్ రిట్రీట్ వేడుక రద్దు
x
Highlights

భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో వాఘా సరిహద్దు వద్ద రోజూ నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌...

భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో వాఘా సరిహద్దు వద్ద రోజూ నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. భారత్‌కు చెందిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికులు, పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతును బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరుదేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా నిరాటంకంగా జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories