logo

బిగ్ బాస్ ౩ కి బండ్ల వింత కండిషన్లు..?

బిగ్ బాస్ ౩ కి బండ్ల వింత కండిషన్లు..?

బుల్లితెరపైన బిగ్ బాస్ షోకి మంచి క్రేజే ఏర్పడింది .. ఇప్పుడు మూడో సీజన్ కి రంగం సిద్దం కాబోతుంది .. ఇప్పటికే దీనికి హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయ్యాడు . దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. ఇక ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్ల కోసం వేట మొదలుపెట్టారు నిర్వాహకులు .. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ యాంకర్ ఝాన్సీ , హీరో తొట్టెంపూడి వేణు , కేఎ పాల్ పేర్లు వినిపించాయి ..

అయితే తాజాగా ఇందులోకి మరో సేలబ్రేటి పేరు వినిపిస్తుంది . ఆయనే బండ్ల గణేష్ .. అయితే ఈ షోలో పాల్గొనాలి అంటే బండ్ల నిర్వాహకులకు బండ్ల వింత కండిషన్లు పెట్టాడట .. వీలయినంత వరకు తనకి ఫోన్ అందుబాటులో వుండాలని, కుటుంబ సభ్యలతో టచ్ లో వుండే అవకాశం వుండాలని బండ్ల గణేష్ కోరినట్లు తెలుస్తొంది.

బిగ్ బాస్ షో అంటేనే షో లో ఉన్నన్ని రోజులు కుటుంబ సభ్యులకు మరియు బయటి ప్రపంచంకు దూరంగా ఉండటం. అలాంటిది ఫోన్ కావాలని అడిగితే ఎలా ఇస్తారని బండ్ల బాబు అనుకున్నాడో మరి .. !

లైవ్ టీవి

Share it
Top