Top
logo

పార్టీ మారే యోచనలో దత్తన్న..? గూలాబీ గూటీకి?

పార్టీ మారే యోచనలో దత్తన్న..? గూలాబీ గూటీకి?
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే పార్లమెంట్‌ అభ్యర్ధుల జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా విడుదలైన ...

తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే పార్లమెంట్‌ అభ్యర్ధుల జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే కాగా విడుదలైన జాబితాలో ఆద్వాణీకి, దత్తాత్రేయకు అవమానం జరిగింది. గుజరాత్‌లో అద్వానీ స్థానంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేస్తున్నారు. ఇటు సీనియర్ లీడర్ ,సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో కిషన్‌రెడ్డిని ఎంపిక చేశారు. కాగా ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ ఎంపీ దత్తాత్రేయ పార్టీ మారే యోచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత రాత్రి బీజేపీ ప్రకటించిన జాబితాలో దత్తాత్రేయకు చోటు లభించలేదు. దీంతో తన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశం అయినట్లు తెలుస్తోంది. గూలాబీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు దత్తన్న వర్గీయులు.పార్టీ మారీ గూలాబీ గూటీకి చేరుతారా లేదా అన్నది మరి కొద్ది గంటల్లో తెలనుంది.


Next Story