Top
logo

సన్మానాలు, అవమానాలు సమానంగా భరిస్తా: దత్తాత్రేయ

సన్మానాలు, అవమానాలు సమానంగా భరిస్తా: దత్తాత్రేయ
Highlights

బీజేపీ తనకు అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. ఏ రోజూ కూడా తాను...

బీజేపీ తనకు అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. ఏ రోజూ కూడా తాను టిక్కెట్టు ఇవ్వమని పార్టీని కోరలేదన్నారు. సన్మానాలు, అవమానాలు సమానంగా భరిస్తానని చెప్పిన ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉంటానని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు బండారు దత్తాత్రేయ. బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే కాగా ఆ జాబితాలో దత్తాత్రేయకు మొండి చేయిచూపెట్టింది అధిష్ఠానం. ఆ స్థానంలో కిషన్ రెడ్డి పోటీలో దిగుతున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it