Top
logo

మాంజా అమ్మితే ఐదేళ్ల జైలు శిక్ష..

మాంజా అమ్మితే ఐదేళ్ల జైలు శిక్ష..
X
Highlights

సంక్రాంతి, ఇతర పండుగలకు, సరద కోసం పతంగి ఎగురవేస్తూటం. అయితే పతంగి ఎగరవేసే బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో పక్షులకు ప్రమాదం

సంక్రాంతి, ఇతర పండుగలకు, సరద కోసం పతంగి ఎగురవేస్తూటం. అయితే పతంగి ఎగరవేసే బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో పక్షులకు ప్రమాదం జరగవచ్చునని అటవీశాఖ చీఫ్ కన్ఝర్వేటర్ ప్రశాంత్ కుమార్ ఝా అన్నారు. అయితే ఈ బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజాతో ఇటివలే కొండాపూర్‌లో ఓ వ్యక్తి మరణించడని ప్రశాంత్ కుమార్ తెలిపారు. గ్రీన్ టైబ్యునల్ ఆదేశాలతో రాష్ట్రంలో కూడా చైనీస్ మాంజాపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించారు. బ్రాస్ కోటింగ్ నైలాన్ మాంజా వినియోగాన్ని పూర్తిగా అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నుండి చైనా మాంజా అమ్మితే ఐదేళ్లు జైలు, రూ. లక్ష జుర్మానా విధింపు వర్తిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్ పాత బస్తీలో ఈ రకమైన మాంజాను ఇప్పటికే సీజ్ చేసినట్లు తెలిపారు.

Next Story