Top
logo

మీడియాపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన..

మీడియాపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన..
Highlights

సినీ నటుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి బూతులతో చెలరేగిపోయారు. బుధవారం అనంతపురం జిల్లా...

సినీ నటుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి బూతులతో చెలరేగిపోయారు. బుధవారం అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంలో నందమూరి బాలకృష్ణ తన తన స్వరూపాన్ని బయటపెట్టారు.మీడియా ప్రతినిధి పట్ల బాలయ్య దురుసుగా ప్రవర్తించాడు. కాగా బాలకృష్ణ ప్రచారంలో భాగంగా తన వస్తున్నప్పుడు పక్కన ఉన్న చిన్న పిల్లలను బాలయ్య బాడీగాడ్స్ పక్కకు లాగిపడేశారు.

ఇక దీంతో పక్కనే ఉన్న జర్నలిస్ట్ దాన్నీ కాస్తా చిత్రికరించాడు. అంతే బాలయ్య సినిమాలో డైలాగ్ చెప్పినట్లు "నీకు బీపీ వొస్తే నీ పీఏ వనుకుతాడేమో కానీ నాకు బీపీ వొస్తే ఏపీ మొత్తం వొణుకుద్ది" అన్న రేంజ్‌లో బాలయ్య బాబు రెచ్చిపోయాడు. ఆ ఘటనను షూట్‌ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు బాలయ్య. కెమెరాతో తీసిన దృశ్యాలను వెంటనే తొలగించాలని జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారు. రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను అని బెదిరించాడు. తనకు బాంబులు వేయడం​ కూడా తెల్సునని అలాగే కత్తి తిప్పడం కూడా తెల్సు అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి. బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులు ధర్నకు దిగి వెంటనే బాలకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి.లైవ్ టీవి


Share it
Top