బాలకృష్ణ మరో నిర్వాకం.! వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్త

బాలకృష్ణ మరో నిర్వాకం.! వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్త
x
Highlights

సినీ నటుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో సారి తన కోపాన్ని చూపించాడు. ఇటివలే అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో మీడియా...

సినీ నటుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో సారి తన కోపాన్ని చూపించాడు. ఇటివలే అనంతపురం జిల్లా హిందుపురంలో ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధి పట్ల బాలయ్య దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే కాగా తాజాగా తమ సొంత టీడీపీ పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లారు బాలయ్య. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్‌ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని బాలయ్యను కోరారు. ఇక దీంతో నన్నే ప్రశ్నిస్తావా అని అనుకున్నాడో ఏమో ఆగ్రహానికి గురైన బాలయ్య ఆ కార్యకర్తని తోసేశారు. వెంటనే ఆ కార్యకర్తను బయటకు పంపండి అని ఆదేశించడంతో పోలీసులు అక్కడి నుండి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్‌ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వెంటనే సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories