Top
logo

బ్యాక్‌ టు హైదరాబాద్‌... బారులు తీరిన వాహనాలు

బ్యాక్‌ టు హైదరాబాద్‌... బారులు తీరిన వాహనాలు
Highlights

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వారు రిటర్న్ అవుతున్నారు. వాహనాలు హైదరాబాద్ వైపు పయనమవుతున్నాయి. బుధవారం ...

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వారు రిటర్న్ అవుతున్నారు. వాహనాలు హైదరాబాద్ వైపు పయనమవుతున్నాయి. బుధవారం టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాలు వదలాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశించాయి. టోల్ నిలుపుదల ఆదేశాలను కొన్నిచోట్ల పాటించడం లేదు. యథేచ్చగా టోలు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద యథేచ్చగా టోలు వసూలు చేస్తున్నారు. సర్కారు నిబంధనలు ఉల్లంఘించడంపై నిర్వాహకులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా పంతంగి, కొర్లపహాడ్ , బీబీ నగర్ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుం వసూలు చేయడం లేదు. టోలు ఫీ వసూలు చేయకుండా నిర్వాహకులు వాహనాలను పంపించి వేస్తున్నారు. దీంతో వాహనాలు వేగంగా టోల్ గేట్లను దాటుకుంటూ వెళుతున్నాయి.

Next Story