వేడెక్కుతున్న విశాఖ రాజకీయాలు...భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా...

వేడెక్కుతున్న విశాఖ రాజకీయాలు...భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా...
x
Highlights

విశాఖ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ కూటికి చేరబోతున్నారన్న వార్తతో సాగరతీరంలో పాలిటిక్స్ ప్రకంపనలు...

విశాఖ రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ కూటికి చేరబోతున్నారన్న వార్తతో సాగరతీరంలో పాలిటిక్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే సీటు కేటాయింలులో ఖచ్చితత్వం లేకనే ఎంపీ శ్రీనివాస్ ఫ్యాను వైపు తిరిగిపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఎన్నికల నగరా మోగలేదు అభ్యర్థులకు సీట్లు ఇంకా ప్రకటించలేదు అయినా విశాఖ రాజకీయాలు రోజు రోజుకూ మారుతున్నాయి. టీడీపీ కి కంచుకోట అయిన విశాఖ‌లో పార్టీ ఫిరాయింపులు మొదలవడం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రజారాజ్యం పార్టీ నుండి మంత్రి గంటా శ్రీనివాసరావు తో పాటు అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గంటా అనునయుడుగా పేరొందిన అవంతి అనకాపల్లి ఎంపీ గా పోటీ చేసారు. ఏమ్మేల్యే గా అవంతికి పట్టు వున్న భీమిలి నియోజకవర్గం నుండి గంటా పోటీ చేసి గెలుపొందారు.

అవంతి శ్రీనివాస్ రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి నిరాకరించినట్లు సమాచారం ఈ సారి భీమిలి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అవంతి శ్రీనివాస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గం నుంచి గంటా పోటీ పడుతున్నారు దీంతో టీడీపీ అధిష్టానం భీమిలి సీటుపై స్పష్టత ఇవ్వనట్లు. దీంతో కొంతకాలంగా అవంతి అసంతృప్తిగా ఉనట్లు తెలుస్తోంది. దీని కారణంగానే అవంతి పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గోవట్లేదని త్వరలో పార్టీ వీడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అవంతి ఆశిస్తున్న భీమిలి నియెజకవర్గం నుండి వైసీపీకి బలమైన అభ్యర్థి లేడు మరోవైపు అక్కడ టీడీపీని ఎదుర్కోవాలంటే వైసీపీకి అవంతి వంటి నేత అవసరం ఉంది దీంతో కొంత కాలంగా అవంతికి వైసీపీ ఆహ్వానాలు పంపుతునట్లు సమాచారం అందుతోంది. దీంతో భీమిలిలో తన పట్టు నిలుపుకోవాలని అవంతి చూస్తునట్లు సమాచారం. మొత్తానికి అవంతి వైసీపీ నుంచి భీమిలిలో పోటీ చేస్తే గురు శిష్యుల మధ్య ఆసక్తికర పోరు తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories