స్టోక్స్‌ పోరాటం వృధా.. సెమిస్ లోకి ఆసిస్ ..

స్టోక్స్‌ పోరాటం వృధా.. సెమిస్ లోకి ఆసిస్ ..
x
Highlights

ఐదుసార్లు ఛాంపియన్‌ గా నిలిచినా ఆసిస్ మరోసారి సెమిస్ లోకి దూసుకు వెళ్ళింది .. నిన్న ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ 64 పరుగుల తేడాతో...

ఐదుసార్లు ఛాంపియన్‌ గా నిలిచినా ఆసిస్ మరోసారి సెమిస్ లోకి దూసుకు వెళ్ళింది .. నిన్న ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది .ఇంగ్లాండ్ బాట్స్ మెన్ స్టోక్స్‌ (89; 115 బంతుల్లో 8×4, 2×6) ఒంటరి పోరాటం వృధాగానే మిగిలింది .. టాస్ ఒడి మొదటగా బ్యాటింగ్ కి దిగిన ఆసిస్ జట్టుకు ఓపెనర్స్ ఫించ్ మరియు వార్నర్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు .. 123 పరుగుల వద్ద అ జట్టు ముందుగా వార్నర్ రూపంలో మొదటి వికెట్ ని కోల్పోయింది .. అ తర్వాత వచ్చిన ఫించ్ మరియు ఖవాజా ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు .. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్నా ఆసిస్ జట్టును ఇంగ్లిష్ బౌలర్లు కళ్ళెం వేసారు .. సెంచరీ పూర్తి చేసిన ఫించ్ అవుట్ అవడంతో అ జట్టు తర్వాతి బాట్స్ మెన్స్ పెద్దగా రాణించలేకపోయారు .. దీనితో ఆసిస్ 285 పరుగులు చేయగలిగింది .. చివరి 15 ఓవర్లో ఆసిస్ జట్టు చేసిన పరుగులు 98 మాత్రమే ..

లక్ష్య చేదన కి దిగిన ఇంగ్లిష్ జట్టుకు ఆసిస్ బౌలర్లు చుక్కలు చూపించారు .. ఆసిస్ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది .. అయితే ఒక పక్కా నుండి వికెట్లు పడుతున్న మరో పక్కా స్టోక్స్‌ పోరాటం చేస్తూనే ఉన్నాడు .. బట్లర్ తో కలిసి 71 పరుగుల భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడు .. అ తర్వాత బట్లర్ అవుట్ అయ్యాడు ..అ తర్వాత వచ్చిన వోక్స్ తో కలిసి మరో అద్బుతమైన భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడు స్టోక్స్‌.. కాసేపు వీరు ఆసిస్ బౌలర్లకు కొరకరాని కొయ్యలాగా తయారయ్యారు.. ఇక చివర్లో బెరెన్‌డార్ఫ్‌ మెరవడంతో ఇంగ్లాండ్ జట్టు కథ సమాప్తం అయిపొయింది .. మొత్తం ఇంగ్లాండ్ జట్టు 44.4 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది .. ఆసిస్ జట్టులో కీ రోల్ ప్లే చేసిన ఫించ్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories