ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాన్.. 19 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ధూళి తుపాన్.. 19 మంది మృతి
x
Highlights

ఈ మధ్య కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దుమ్ము, ధూళి తుపాన్లు తరచుగా సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ పై ధూళి తుపాను ప్రతాపం చూపించింది. మెయిన్ పురి,...

ఈ మధ్య కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో దుమ్ము, ధూళి తుపాన్లు తరచుగా సంభవిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ పై ధూళి తుపాను ప్రతాపం చూపించింది. మెయిన్ పురి, కస్ గంజ్, బదౌన్, పిలిభిత్, కనౌజ్, మొరాదాబాద్, సాంభల్, ఘజియాబాద్ ప్రాంతాల్లో తుపాను విజృంభించింది. ఘటనలో 19 మంది మృతిచెందగా 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు 8 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించి మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలకు ఉపక్రమించాలంటూ ఆదేశించారు.దీంతో అధికారులు రంగంలో దీగి చర్చలు చేపడతున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories