Top
logo

ఎన్నికల వేళ భారీగా నగదు, లిక్కర్ పట్టివేత

ఎన్నికల వేళ భారీగా నగదు, లిక్కర్ పట్టివేత
Highlights

దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారీగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న...

దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారీగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు 143.47 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అలాగే 89.64 కోట్ల విలువైన మద్యం, 131.75 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, 12 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 55 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే 30 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తున్న 16 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే ఆరు కోట్ల విలువైన వస్తువులను కూడా పట్టుకున్నారు.


లైవ్ టీవి


Share it
Top