ముస్లింలకు తిండి దండగ..: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలకు తిండి దండగ..: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ ముస్లిం వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు పాలిచ్చే గోవులు కాదని, అలాంటప్పుడు...

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ ముస్లిం వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు పాలిచ్చే గోవులు కాదని, అలాంటప్పుడు తిండి దండగే కదా అని ఎమ్మెల్యే వ్యాఖ్యనించారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ, ముస్లిం వర్గాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలని శాసనసభలో ప్రతిపక్ష నేత దేవవ్రత సైకియా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నికల్లో ముస్లిం ఓట్లతో పనిలేదన్నచెప్పిన ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్ ఒకవేళ అధికార పగ్గాలు చేపట్టాక అసలు ముస్లింల సంక్షేమం కోసం తమ సర్కార్ పనిచేయదని కూడా అన్నారని దేవవ్రత సైకియా స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంత ఫకాన్‌ 90 శాతం ముస్లింలు మా పార్టీకి ఓట్లే వేయరని అందుకనే అలా ముస్లిం ఓటర్ల గురించి అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. ముస్లిలం ఓట్లతో మా గెలుపోటములు డిసైడ్‌ కావు. ఎందుకంటే 90 శాతం హిందువులు మా పార్టీకి ఓటేస్తారు. అందుకే అలా అన్నాను గాని నేను ఎవరినీ ఎవరితో ఎవరికతో పోల్చలేదు అని ఫకాన్‌ చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories