ఆసరా పింఛన్లు పెంపు...జులై నుంచి పింఛను ఎంతంటే ?

ఆసరా పింఛన్లు పెంపు...జులై నుంచి పింఛను ఎంతంటే ?
x
Highlights

ఆసరా పెన్షన్లు రెట్టింపు కానున్నాయి. పెంచిన పెన్షన్ల మొత్తం జులై నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి...

ఆసరా పెన్షన్లు రెట్టింపు కానున్నాయి. పెంచిన పెన్షన్ల మొత్తం జులై నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి వృద్దాప్య పెన్షన్ 2,016 రూపాయలు, దివ్యాంగులకు 3,016 రూపాయలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 39లక్షల 32వేల 309మందికి లబ్ధి చేకూరనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు శుభవార్త అందించారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లు రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులకు నెలకు 3,016, వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు , బీడీ కార్మికులు , హెచ్‌ఐవీ ఎయిడ్స్ బాధిుతులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులకు నెలకు 2,016 రూపాయల పెన్షన్ అమలు చేయనున్నారు. పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు కానున్నాయి. ఈ మేరకు పెరిగిన పింఛన్లు జులై నెలలో లబ్దిదారులకు అందనున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం ఆసరా పెన్షన్ దారులు 39లక్షల 32వేల 309మంది ఉన్నారు. అందులో వృద్ధాప్య పెన్షన్‌దారులు 13లక్షల 14వేల, 936 మంది ఉన్నారు. 49వేల 709మంది దివ్యాంగులున్నారు. మితంతువులు 14లక్షల 42వేల 759మంది ఉన్నారు. వీరితో పాటు 37వేల 312మంది చేనేత కార్మికులు, 62వేల 862మంది కల్లు గీతా కార్మికులు, 28వేల 573 మంది హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, 14వేల 140మంది బోధకాల బాధితులు, 4లక్షల 8వేల 718మంది బీడీ కార్మికులు ఉండగా 1లక్ష 32వేల 300 మంది ఒంటరి మహిళలు ఆసరా పెన్షన్ ద్వారా పెన్షన్ పొందుతున్నారు. వీరిందరికి పెరిగిన పెన్షన్లు జులై నెలలో లబ్ధిదారులకు అందనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories