Top
logo

కమల్ కామెంట్లకు ఒవైసీ సపోర్ట్

కమల్ కామెంట్లకు ఒవైసీ సపోర్ట్
Highlights

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన వ్యక్తిని ఉగ్రవాది కాక ఇంకేమంటారని అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. కపూర్...

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన వ్యక్తిని ఉగ్రవాది కాక ఇంకేమంటారని అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. కపూర్ కమిషన్ కూడా హంతకుడేనని గాడ్సేను నిర్ధారించిన తర్వాత కూడా అతగాడిని ఉగ్రవాది కాక మహాత్ముడంటారా అని ప్రశ్నించారు. నటుడు కమల్ హాసన్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అరవక్కురిచ్చిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ..' 'గాంధీ విగ్రహం ముందు నిలబడి ఒకటి చెబుతున్నా..దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే. మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారని ఈ మాట చెప్పడం లేదు. ఎక్కడైనా ఇదే మాట చెబుతా' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


లైవ్ టీవి


Share it
Top