Top
logo

జగన్‌ పిలిస్తే ప్రచారం చేస్తా: ఓవైసీ

జగన్‌ పిలిస్తే ప్రచారం చేస్తా: ఓవైసీ
X
Highlights

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ...

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. నగరంలోని దారుసలాంలో ఎంఐఎం 61వ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గోన్న అసదుద్దీన్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీ 35 సీట్లు సాధించే అవకాశముందని అసదుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లను తప్పకుండా సాధిస్తుందన్నారు. ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనను ఆహ్వానిస్తే ఏపీలో తప్పకుండా వైసీపీ తరపున ప్రచారం చేస్తానన్నారు. అలాగే అభినందన్ మన దేశానికి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు అసదుద్దీన్ తెలిపారు. కమాండర్ అభినందన్ విషయంలో రాజకీయం చేయొద్దన్నారు.

Next Story