Top
logo

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Highlights

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాసేపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారారు. రద్దీగా ఉండే పాతబస్తీ రోడ్లపై...

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాసేపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా మారారు. రద్దీగా ఉండే పాతబస్తీ రోడ్లపై ట్రాఫిక్‌ను కంట్రోల్ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా వెళుతున్న వాహనదారులకు క్లాస్ పీకారు. హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు అడ్డదిడ్డంగా వెళుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అటూ నుంచి వెళుతున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారు దిగారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అవతారం ఎత్తారు. రోడ్డుపై ఇష్టానుసారంగా వెళుతున్న వాహనాలను ఎంపీ నియంత్రించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ కు అనుగుణంగా వాహనాలను పంపించారు. ఎంపీ అనే గర్వం లేకుండా, ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన ఎంపీ అసదుద్దీన్ ను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.


Next Story


లైవ్ టీవి