సరిహద్దుల్లో యుద్ధవిమానాలు

సరిహద్దుల్లో యుద్ధవిమానాలు
x
Highlights

పుల్వామా ఘటన తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాక్ పై చర్యలకు అన్ని ర కాల దౌత్య మార్గాలు...

పుల్వామా ఘటన తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాక్ పై చర్యలకు అన్ని ర కాల దౌత్య మార్గాలు పరిశీలిస్తూనే అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే సహరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలు మొహరించింది. ఇటీవలేనే భారత్ వాయుసేన సత్తా చాటే విధంగా వాయు శక్తి విన్యాసాలు చేయాలని భావించిన భారత్ జాగ్వార్ ఫైటర్ విమానాలు మిరాజ్ 2000 విమానాలను మల్టీ-రోల్ జెట్స్ ను మొహరించింది. విన్యాసాల కోసం మొహరించిన ఈ ఫైటర్ విమానాలతోనే ఇప్పుడు పాక్ పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సైన్యం సన్నాహాలు చేస్తోంది.

పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించకుండా కఠిన చర్యల్ని తీసుకునే దిశగా భారత్ వేస్తున్న అడుగులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. కశ్మీర్ లో ఉన్న టెర్రరిస్టులను వెనక్కి రప్పిస్తోంది. ఎన్నో ఉగ్రవాద శిభిరాలను మూసివేస్తోంది. ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని భారత ప్రధాని మోడీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది.

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతా దళాల రక్తం ఉడుకుతోంది కశ్మీర్ లో జరిగే ప్రతి దాడి వెనుక పాక్ హస్తం ఉందని ఇండియన్ ఆర్మీ భావిస్తుంది ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా అంటూ భద్రత బగాలు ప్రశ్నిస్తున్నాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పని పట్టేందుకు సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్చ ఇచ్చామని ప్రధాని మోడీ ప్రకటించడంతో మిలటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories