Top
logo

మోడీపై పోటీలో ఒక్క పసుపురైతు కూడా లేడు: ధర్మపురి అర్వింద్

మోడీపై పోటీలో ఒక్క పసుపురైతు కూడా లేడు: ధర్మపురి అర్వింద్
X
Highlights

కల్వకుంట కవిత ప్రేరణతో నిజామాబాద్ పసుపు రైతులు నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్నారనే వార్తలను బీజేపీ నేత ధర్మపురి...

కల్వకుంట కవిత ప్రేరణతో నిజామాబాద్ పసుపు రైతులు నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్నారనే వార్తలను బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ఖండించారు. మోడీపై పోటీ చేయడానికి బయలుదేరుతున్నవారిలో ఒక్క పసుపురైతు కూడా లేడని అర్వింద్ అన్నారు. మోడీపై పోటీచేస్తున్న పదిమంది రైతులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదని వీరంతా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువాలు మెడలో వేసుకుని‌ ఆ పార్టీ కోసం పనిచేశారని అర్వింద్ ఆరోపించారు. ఇది సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీ అని నామినేషన్లు వేసే వాళ్లంతా అ తరువాత సమ్మర్ ఎంజాయ్ ప్రోగ్రామ్‌కు వెళ్తునున్నట్లు అర్వింద్ తెలిపారు. ఇదంతా ఓ రాజకీయ డ్రామా అని అర్వింద్ కొట్టిపారేశారు.

Next Story