'మద్దతు' కోసం మరో పోరు...పోలీసులు భారీగా మోహరించినా పెద్దఎత్తున తరలివచ్చిన అన్నదాతలు

మద్దతు కోసం మరో పోరు...పోలీసులు భారీగా మోహరించినా పెద్దఎత్తున తరలివచ్చిన అన్నదాతలు
x
Highlights

పసుపు, ఎర్రజొన్న రైతులు మళ్ళీ పోరుబాట పట్టారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోరుతూ ఆర్మూర్‌‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. పసుపు- ఎర్రజొన్న రైతు కమిటీ...

పసుపు, ఎర్రజొన్న రైతులు మళ్ళీ పోరుబాట పట్టారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోరుతూ ఆర్మూర్‌‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. పసుపు- ఎర్రజొన్న రైతు కమిటీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఛలో ఆర్మ‌ూర్‌లో భాగంగా మామిడిపల్లి చౌరస్తాలోని 63వ జాతీయ రహదారిపై మహాధర్నా చేస్తున్నారు. ఆర్మూర్ డివిజన్‌లోని 14 మండలాల నుంచి పాదయాత్రగా మామిడిపల్లి చౌరస్తా దగ్గరికి చేరుకున్న అన్నదాతలు మహా ధర్నాలో పాల్గొన్నారు. కష్టపడి పంట పండించిన తమకు న్యాయం చేయాలని అన్నదాతలు నినాదాలు చేస్తున్నారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్‌లోని 14 మండలాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆర్మూర్ డివిజన్‌ మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మహాధర్పాను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా మోహరించినా రైతులు మహాధర్నాలో పాల్గొనడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. ఇంటికి ఇద్దరు చొప్పున తరలి రావాలని పసుపు- ఎర్రజొన్న రైతు కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలు మహా ధర్నాతో పాటు వంటా వార్పూ నిర్వహిస్తున్నారు. అయితే మామిడిపల్లి చౌరస్తా దగ్గరకు తరలివస్తున్న రైతుల వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు.

క్వింటా పసుపును 15వేలకు, ఎర్రజొన్నలను 3 వేల 500 చొప్పున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న మద్దతు ధర డిమాండ్‌తో ఈ నెల 7వ తేదీ నుంచి ధశల వారీగా ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇవాళ మరోసారి రోడ్డెక్కారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే గ్రామానికి ఇద్దరు చొప్పున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ఆర్మూరు రైతులు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories