logo

హరివిల్లును తలపిస్తోన్న విశాఖ మన్యం

విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి.

Balloon FestivalBalloon Festival

విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. అందమైన బుడగులతో అరకు మరింత అందంగా కనిపిస్తోంది. ఇక పర్యాటకులకైతే విశాఖ మన్యం సరికొత్త అనుభూతిని పంచుతోంది.

విశాఖ మన్యం హరివిల్లును తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. విశాఖ అరకు లోయలో ప్రతి ఏటా నిర్వహించే హాట్ బెలూన్ ఫెస్టివల్‌ను పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దాదాపు 26 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు బెలూన్ గ్లైడర్స్ తమ బ్రాండింగ్ ను ప్రదర్శిస్తున్నారు. ఈసారి కార్న్ ఫ్లా, జోకర్, ఎగ్, స్ట్రాబెర్రీ, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు సాధారణ బెలూన్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు విభాగాల్లో బెలూన్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 10మంది కెపాసిటీ, అలాగే ఆరుగురు సామర్ధ్యమున్న బెలూన్లలో పర్యాటకులు ఆకాశ పర్యటన చేస్తున్నారు. సుమారు గంటపాటు మన్యం అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నారు.

అనుకూలమైన వాతావరణంతోపాటు సంక్రాంతి అండ్‌ వారాంతపు సెలవులు కలిసి రావడంతో ఈసారి హాట్ బెలూన్ ఫెస్టివల్‌‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పర్యాటకులతో అరకు సందడిగా మారింది.

లైవ్ టీవి

Share it
Top