Top
logo

కూతురు ముఖానికి ముసుగెందుకు? ఏఆర్ రెహమాన్ ను నిలదీసిన నెటిజన్లు

కూతురు ముఖానికి ముసుగెందుకు? ఏఆర్ రెహమాన్ ను నిలదీసిన నెటిజన్లు
X
Highlights

సెలబ్రిటీలు ఏం చేసినా ఎంటైర్టైన్మెంట్ ఎంజాయ్ అనుకుంటారు కానీ నెటిజన్లు మాత్రం ఎవరినీ వదలటం లేదు సాదాసీదా...

సెలబ్రిటీలు ఏం చేసినా ఎంటైర్టైన్మెంట్ ఎంజాయ్ అనుకుంటారు కానీ నెటిజన్లు మాత్రం ఎవరినీ వదలటం లేదు సాదాసీదా నటులైనా స్టార్ హీరోలైనా ఎవరూ అని చూడకుండా ఏకి పారేస్తున్నారు తాజాగా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహెమాన్ కు సైతం ఇదే అనుభవం ఎదురైంది కూతురు ముఖానికి ముసుగెందుకు అంటూ నెటిజన్లు రెహమాన్ ను ఆటాడుకున్నారు.

ఏం పొరబాటు చేసినా చెల్లుతుందనుకుంటున్న సెలబ్రిటీలకు నెటిజన్లు తనదైన స్టైల్లో స్పందించారు ఇటీవల ముంబైలో 'స్లమ్‌ డాగ్‌ మిలయనీర్‌' సినిమా పదో వార్షికోత్సవ వేడుకలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ కూతురుతో కలిసి హాజరయ్యారు. ఇదే వేదికపై తండ్రి రెహమాన్ ను ఇంటర్యూ చేసింది కూతురు ఖతిజా అయితే ఆమె ముఖం కనిపించకుండా ముసుగు ధరించడాన్ని నెటిజన్లు టార్గెట్ చేసారు. కూతురి స్వేచ్ఛని తండ్రి హరిస్తున్నారని రెహమాన్ బలవంతం చేసినందుకే ఆమె ముఖాన్ని దాచుకుందని ఆడేసుకుంటున్నారు. వస్త్రధారణ విషయంలో నిబంధనలు పెట్టినందుకే ఖతిజా ముఖాన్ని కవర్ చేసుకుందని రెహమాన్‌పై విమర్శలు గుప్పించారు. ఇది సిగ్గుచేటు అంటూ దుమ్మెత్తిపోశారు

నెటిజెన్ల ట్రోలింగ్ తనదైన స్టైల్లో స్పందించారు ఏఆర్ రెహ్మాన్. ఆయన కుటుంబ సభ్యులు నీతా అంబానీతో దిగిన ఫొటోను షేర్ చేసి గట్టిగా కౌంటరిచ్చారు. ఆ ఫొటోలోనూ ఖతీజా ముసుగు ధరించే ఉంది. రెహమాన్ భార్య రహీమా, మరో కూతురు సైరా మాత్రం తమ ముఖాలను ప్రదర్శించారు. 'ఫ్రీడం టు చూస్' హ్యాష్‌ట్యాగ్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు రెహమాన్.'ఎంచుకునే స్వేచ్ఛ' ఉందంటూ తనను విమర్శించే వారికి కౌంటర్ ఇచ్చారు.

అటు తన తండ్రిపై వస్తున్న విమర్శలపై ఖతిజా సైతం మండిపడ్డారు. తన ఇష్టప్రకారమే ముసుగు ధరించానని తనకు అలా ఉండడమే నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ముసుగు ధరించాలని ఎవరూ బలవంతపెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. తానేం చిన్నపిల్లను కాదని జీవితానికి సంబంధించి తానే నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టంచేశారు. 'ఎంచుకునే స్వేచ్ఛ' తనకు ఉందటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది ఖతిజా.

సెలబ్రిటిలను నేరుగా ప్రశ్నించలేకపోయినా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్శం కురిపిస్తున్నారు నెటిజన్ల పోస్టులతో సెలబ్రిటిలు జవాబిచ్చుకోక తప్పడం లేదు.Next Story