జూన్‌ 13 నుంచి ఆర్టీసి సమ్మె: ఏపీ ఆర్టీసి జెఏసి

జూన్‌ 13 నుంచి ఆర్టీసి సమ్మె: ఏపీ ఆర్టీసి జెఏసి
x
Highlights

ముందు ప్రకటించినట్లుగా జూన్ 13నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపేస్తామని ప్రకటించారు....

ముందు ప్రకటించినట్లుగా జూన్ 13నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపేస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ 6వేల 300కోట్ల నష్టాల్లో ఉందని ఈ నష్టాలను ప్రభుత్వమే భరించాలని జేఏసీ నేతలు కోరారు. ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ జేఏసి నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బంది కుదింపుపై ఆర్టీసి యాజమాన్యం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories