logo

ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!

ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రకటించింది. ఇవాళ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జేఏసీ సమావేశం అయి సమ్మెపై నిర్ణయం తీసుకుంది.

ఏపీ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. ఫిబ్రవరి 6 నుంచి బస్సులు బంద్!

ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రకటించింది. ఇవాళ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జేఏసీ సమావేశం అయి సమ్మెపై నిర్ణయం తీసుకుంది. నిన్న ఆర్టీసీ ఎండీతో ఎంప్లాయిస్‌ యూనియన్‌ చర్చలు జరిపారు. అయితే ఫిట్‌మెంట్‌ పెంచేది లేదని తేల్చిచెప్పడంతో సమ్మెకే సై అన్నారు. వేతన సవరణతో పాటు 91 డిమాండ్లపై సమ్మెకు వెళ్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. సమ్మె సన్నాహకాలుగా ఫిబ్రవరి 6 వరకు రకరకాలుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.

లైవ్ టీవి

Share it
Top