మళ్ళీ తెరపైకి ఏపీ, తెలంగాణ రిజర్వేషన్ల బిల్లులు

reservation
x
reservation
Highlights

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు రావడంతో ఏపీ, తెలంగాణలో పెండింగ్‌లో పడిన రిజర్వేషన్ బిల్లుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులు, వాల్మీకి సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఏపీ ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తోంటే.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు రావడంతో ఏపీ, తెలంగాణలో పెండింగ్‌లో పడిన రిజర్వేషన్ బిల్లుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కాపులు, వాల్మీకి సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఏపీ ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తోంటే. ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు గళం విప్పుతున్నారు.

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంటు ముందుకు రావడంతో ఏపీ, తెలంగాణలో కోటా తుట్టె మళ్ళీ కదిలింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పంపిన రిజర్వేషన్ల బిల్లులు , తీర్మానాలు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉండడంతో వాటి సంగతేమిటని ఆయా రాష్ట్రాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ బీసీ కోటా సంగతి సరే మా బిల్లుల మాటేంటని నిలదీస్తున్నారు. తాము పంపించిన రిజర్వేషన్ల బిల్లులను ను పట్టించుకోకుండా ఈబీసీ కోటా బిల్లును ఆగమేఘాల మీద తేవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

ఈబీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం ముందుకు తేవడంతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారు. కర్నూలులో బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని తాము కేంద్రానికి నివేదిక పంపామని, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ర్తు చేశారు.

అటు తెలంగాణ శాసనసభ ఆమోదించిన ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఎంపీలకు సూచించారు. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం , ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచాలని యోచించామని అయితే ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదని గుర్తు చేశారు. తమిళనాడులో రిజర్వేషన్లు 69 శాతం ఉన్న సంగతిని గుర్తు చేసిన ఆయన దేశం మొత్తం ఒకే చట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ముస్లిం ,ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం అంగీకరించాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరి కేంద్రం ఈబీసీ బిల్లుతో సరి పెడుతుందా లేదంటే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆయా రాష్ట్రాల రిజర్వేషన్ల బిల్లుకు కూడా త్వరలో పచ్చజెండా ఊపుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories