logo

ఏపీ, తెలంగాణ మధ్య హైఓల్టేజ్‌ పొలిటికల్‌‌ వార్

ఏపీ, తెలంగాణ మధ్య హైఓల్టేజ్‌ పొలిటికల్‌‌ వార్
Highlights

తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ ముదురుతోంది. చంద్రబాబు, కేటీఆర్‌లు మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ డేటాపై తెలంగాణ...

తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ ముదురుతోంది. చంద్రబాబు, కేటీఆర్‌లు మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ డేటాపై తెలంగాణ పెత్తనమేంటని బాబు ప్రశ్నిస్తుంటే అసలు ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.

ఐటీ గ్రిడ్ కేసులో ఏపీ, తెలంగాణ మధ్య హైఓల్టేజ్‌ పొలిటికల్‌‌ వార్ నడుస్తోంది. చంద్రబాబు, కేటీఆర్‌ మధ్య మాటల తూటాలు పేలుతుండగా, పనిలో పనిగా వైసీపీ లీడర్లు కూడా ఏపీ సీఎంపై విరుచుకుపడుతున్నారు.ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తన జోలికి వస్తే వదిలేది లేదంటూ మోడీ, కేసీఆర్, జగన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేయకపోతే చంద్రబాబుకి భయమెందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల తొలగింపు కుట్రలో భాగంగానే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన ఆరోపించారు.

ఐటీ పరిజ్ఞానాన్ని బాబు కుట్రల కోసం వాడుకుంటున్నారన్న వైసీపీ నేత పార్ధసారధి చంద్రబాబుపై రాజద్రో‎హ‍ం కింద కేసు నమోదు చేయాలన్నారు. మొత్తానికి డేటా చౌర్యం కేసులో ఏపీ-తెలంగాణ మధ్య వార్ ముదురుతోంది. మరోవైపు తెలంగాణ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోవడంతో ముందుముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అలాగే ఏపీ సర్కార్‌ ఎలా రియాక్టవుతుందో చూడాలి.


లైవ్ టీవి


Share it
Top