మద్యపాన నిషేధం పై ఫోకస్ చేసిన ఏపీ సర్కార్ .. ఏటా 20 శాతం మందుషాపులు మూసివేత ..

మద్యపాన నిషేధం పై ఫోకస్ చేసిన ఏపీ సర్కార్ .. ఏటా 20 శాతం మందుషాపులు మూసివేత ..
x
Highlights

వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ అ దిశగానే అడుగులు వేస్తున్నారు .. దానిపై కసరత్తు ప్రారంభించారు . అందులో బాగంగానే...

వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ అ దిశగానే అడుగులు వేస్తున్నారు .. దానిపై కసరత్తు ప్రారంభించారు . అందులో బాగంగానే మద్యం దుకాణాలను దశల వారిగా ఎత్తివేసేందుకు కొత్త కొత్త విధానాలను అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది . ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. అయితే, ఈ విధానంలో పలు కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణులున్నాయి. వీటిని ఒకేసారి రద్దు చేయకుండా ఏడాదికి 20 శాతం చొప్పున వచ్చే ఐదేళ్లలో మొత్తం దుకాణాలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా మద్య నిషేధం హామీ అమలు చేసినట్టు అవుతుందని భావిస్తోంది. అదేవిధంగా ఆదాయం తగ్గకుండా మద్యం రేట్లు పెంచడం వంటివాటిపై కసరత్తు చేస్తోంది. మద్యం రేట్లను భారీగా పెంచడం వల్ల అది తాగే వారి సంఖ్య తగ్గుతుందని, ఆ రకంగా కూడా మద్య నిషేధం కొంత వరకు అమలు అవుతుందని అంచనా వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories