ఏపీలో మంత్రుల సీట్లకు ఎసరు ?

ఏపీలో మంత్రుల సీట్లకు ఎసరు ?
x
Highlights

టీడీపీలో పలువురు మంత్రుల సీట్లకు ఎసరు వచ్చి పడింది. ఎంపీగా పోటీ చేసేందుకు పలువురు సిట్టింగ్‌లు నిరాకరిస్తూ ఉండటంతో మంత్రులను ఎంపీలుగా పోటీ చేయాలంటూ...

టీడీపీలో పలువురు మంత్రుల సీట్లకు ఎసరు వచ్చి పడింది. ఎంపీగా పోటీ చేసేందుకు పలువురు సిట్టింగ్‌లు నిరాకరిస్తూ ఉండటంతో మంత్రులను ఎంపీలుగా పోటీ చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో ఆయన పునరాలోచనపడినట్టు సమాచారం. ఇక కేబినెట్‌లో కీలకమంత్రిగా ఉన్న గంటాను కూడా పార్లమెంట్‌ బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. అనకాపల్లి లేదా విశాఖ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే గంటాను కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కడప జిల్లాకు చెందిన మంత్రి ఆది నారాయణ రెడ్డి కడప పార్లమెంట్‌ సీటు కేటాయించారు. మరో మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ వర్గం ఏకం కావడంతో టికెట్ కేటాయింపు అనుమానంగా మారింది. సీట్ల కేటాయింపులో స్పీకర్ కోడెలకు కూడా అసంతృప్తి ఎదురైంది. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం. మరో మంత్రి జవహర్‌కు కూడా భరోసా దక్కలేదు. అధినేత తీరుపై పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి రగులుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories