ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి

ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి
x
Highlights

మంత్రి అచ్చెన్నాయుడు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. సుమారు 30 కిలో మీటర్లు స్వయంగా ఆటో నడిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి టెక్కలి...

మంత్రి అచ్చెన్నాయుడు ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. సుమారు 30 కిలో మీటర్లు స్వయంగా ఆటో నడిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి టెక్కలి వరకు జాతీయ రహదారిపై ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు అండగా చంద్రబాబు ప్రభుత్వం ఇటీవలే టాక్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి మద్దతుగా పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. ఆటో నడుపుతూ టెక్కలి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు అనంతరం జరిగిన జయహో బిసి సదస్సులో పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఆటో నడపటంతో ఆటో వాలాల్లో ఉత్సాహం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories