logo

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ
Highlights

హైకోర్టు తీర్పు మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన...

హైకోర్టు తీర్పు మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో నెంబర్‌ 750 ని విడుదల చేశారు. డీజీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీగా తప్పిస్తూ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును బదిలీ చేయాలంటూ మూడు రోజుల క్రితం ఈసీ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆదేశించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈసీ ఆదేశాలు చెల్లవంటూ వాదించింది. దీనిపై ఈసీ కూడా తనదైన వాదనలు వినిపించింది. పూర్తి వాదనలు విన్న న్యాయస్ధానం రాజ్యాంగ పరంగా ఈసీకి సక్రమించిన అధికారాల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


లైవ్ టీవి


Share it
Top