Top
logo

వివేకా హత్య కేసుపై వాదనలు పూర్తి: తీర్పు రిజర్వ్

వివేకా హత్య కేసుపై వాదనలు పూర్తి: తీర్పు రిజర్వ్
Highlights

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు...

వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిసాయి. ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్త సంస్ధతో విచారణ జరపాలంటూ ప్రతిపక్షనేత జగన్‌తో పాటు వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ పిటిషన్‌లు దాఖలు చేశారు. సిట్ దర్యాప్తుపై తమకున్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే సమయంలో ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సిట్ విచారణ జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది విచారించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించింది.

Next Story


లైవ్ టీవి