బీసీలపై ప్రేమ చాటుకున్న టీడీపీ ప్రభుత్వం : అధిక నిధులు

బీసీలపై ప్రేమ చాటుకున్న టీడీపీ ప్రభుత్వం : అధిక నిధులు
x
Highlights

బీసీల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టం కడుతోంది. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో 20వేల కోట్లు వ్యయం చేసింది. వెనుకబడిన తరగతుల అభ్యుదయమే ధ్యేయంగా...

బీసీల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టం కడుతోంది. బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో 20వేల కోట్లు వ్యయం చేసింది. వెనుకబడిన తరగతుల అభ్యుదయమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక, సామాజికంగా చేయూతనందిస్తూ అండగా నిలుస్తున్నారు చంద్రబాబు. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు కొత్త వెలుగును తీసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన తరగతులకు ఆర్థిక, సామాజిక పరిపుష్టి ఇవ్వాలన్న సంకల్పంతో ఒక మహాయజ్ఞానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తులలో కొనసాగే వారికి ఒకపక్క తోడ్పాటు అందిస్తూనే మరోపక్క బీసీలకు పలు పథకాల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తద్వారా వారిని మరింత అభివృద్ధికి చేరువ చేస్తూ రాష్ట్రంలో నూతన అధ్యయనానికి చంద్రబాబు నాంది పలికారు.

చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎవ్వరూ ఇంతవరకు ఖర్చు చేయని విధంగా గత ఐదేళ్లలో సుమారు 20వేల కోట్ల రూపాయల వరకు బీసీ సంక్షేమ కోసం వ్యయం చేశారు. వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకున్న గత ప్రభుత్వాలకు భిన్నంగా బలహీన వర్గాల నిజమైన అభ్యున్నతికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశకత్వంలో బీసీ సంక్షేమ శాఖ లబ్ధిదారులకు మరింత సులువుగా ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

బీసీ సామాజిక వర్గాలకు ఎన్నడూ లేనివిధంగా గతంలో పోల్చితే గత ఐదేళ్లలోనే 300 శాతం అధిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2004 నుంచి రాష్ట్ర విభజన జరిగిన 2014వరకు కేవలం 7వేల 815 కోట్లు మాత్రమే బలహీన వర్గాల కోసం గత ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. విభజన అనంతరం అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 22, 704కోట్లు బీసీలకు కేటాయించారు. ఇందులో 90శాతంపైగా నిధులను సద్వినియోగం చేసుకున్న వెనుకబడిన వర్గాల లబ్ధిదారులు అన్ని విధాలా అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నారు.

చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల విద్యకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మొత్తం 1253 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఏర్పాటు చేసి 1లక్ష 28,187 మందిని చదివిస్తున్నారు. కష్టపడి చదివే తెలివైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. బీసీలకు సాంస్కృతిక , సామాజిక మేళవింపు ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీసీ భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బీసీ సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories