కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
x
Highlights

మరికొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నేటి నుంచి...

మరికొద్ది గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకూ నామినేషన్లు స్వీకరణ జరగనుంది.

ఏపీలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, జిల్లాల్లో జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకు నామినేషన్ల దాఖలుకు సమయం ఉండగా 26న నామినేషన్ల పరిశీలన, 28వరకూ ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగితే ఓట్ల లెక్కింపు మాత్రం మే 23న నిర్వహిస్తారు.

నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో ఎన్నికల నియమావళి, అభ్యర్థుల ఖర్చు తదితర అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఎన్నికల వ్యయ పరిశీలకులు నామినేషన్ దాఖలు దగ్గరి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకూ అభ్యర్థులు ఖర్చు చేసే ఖర్చుల వివరాలను సేకరిస్తారు. ఈ నేపథ్యంలో ఏపీకి 102 మంది ఎన్నికల పరిశీలకులు రానున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.

అయితే, రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని ద్వివేది కోరారు. ఎన్నికల సక్రమ నిర్వహణ కోసం ఇప్పటికే రాష్ట్రానికి 90 కంపెనీల పారా మిలటరీ బలగాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories