ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ ఫలితాలు విడుదలైయ్యాయి. ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ...

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌ ఫలితాలు విడుదలైయ్యాయి. ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 10 నుంచి ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసువచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ లో 74.39శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంక్ పులిశెట్టి రవిశ్రీ తే, సెకండ్ ర్యాంక్ - వేద ప్రణవ్, థర్డ్ ర్యాంక్ - వత్తి బానుసత్తా సాధించగా మెడికల్‌లో వెంకటసాయి స్వాతి మొదటి ర్యాంక్ సాధించింది. తెలుగు రాష్ట్రల నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది రాయగా.. 1,35,160 (74.39శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరకాగా 68, 512 (83.64శాతం) మంది క్యాలీఫై అయినట్లు అధికారులు వెల్లడించారు.

గత ఎప్రిల్‌లో 20 నుంచి 23 వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. అయితే మే 18 నే ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నా తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడంతో నేడు విడదల చేశారు. మరోవైపు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories