Top
logo

డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ

డేటా చోరీ కేసుపై స్పందించిన ఏపీ డీజీపీ
Highlights

ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మంగళవారం స్పందించారు. ఐటీ గ్రిడ్‌ సీఈవో అశోక్‌ ఏపీలో...

ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మంగళవారం స్పందించారు. ఐటీ గ్రిడ్‌ సీఈవో అశోక్‌ ఏపీలో ఉన్నట్టు తమకు సమాచారం లేదని డీజీపీ ఠాకూర్‌ స్పష్టం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన డీజీపీ. రాష్ట్రవ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయన్నారు. ఓట్ల తొలగింపు కేసుల్లో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఫామ్‌-7 దరఖాస్తు చేశారని, పక్కా ప్లాన్‌ ప్రకారం లక్షల ఓట్లు తొలగించినట్టు తెలుస్తోందన్నారు. కేసుల విచారణలో భాగంగా పోలీసులు ఎక్కడికైనా వెళ్లొచ్చని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారు. ఐటీ గ్రిడ్‌ ఉద్యోగి భాస్కర్‌ మిస్సింగ్‌ కేసులో గుంటూరు పోలీసులు హైదరాబాద్‌ వెళ్లారని చెప్పిన డీజీపీ కేసు విచారణలో భాగంగానే లోకేశ్వర్‌ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారని తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top