logo

మమతతో బాబు మార్చ్‌

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కొల్‌కతా వెళ్లనున్నారు. రేపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో కొల్ కతాలో నిర్వహిస్తున్న ర్యాలీలో ఆయన పాల్గొంటారు.

ChandrababuChandrababu

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కొల్‌కతా వెళ్లనున్నారు. రేపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో కొల్ కతాలో నిర్వహిస్తున్న ర్యాలీలో ఆయన పాల్గొంటారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటే ఈ ప్రదర్శనకు చంద్రబాబుతో పాటు కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్‌ కేజ్రీవాల్, ఇతర పార్టీల నేతలు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విపక్షాల ఐక్యతను చాటే ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు.

మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ దూరంగా ఉండగా, కాంగ్రెస్‌ తరఫు నుంచి మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు , కర్ణాటక, దిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్‌ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. అలాగే శరద్‌ యాదవ్‌, స్టాలిన్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ హాజరుకానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు మమతా బెనర్జీ నిర్వహించనున్నర్యాలీకి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర మంచ్‌ అనే రాజకీయ బృందం తరఫు నుంచి ఆయన హాజరవుతున్నట్లు ప్రకటించి కమలనాథులను షాక్ లో ముంచెత్తారు.

లైవ్ టీవి

Share it
Top