కియా ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసింది: చంద్రబాబు

కియా ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసింది: చంద్రబాబు
x
Highlights

అనంతపురం జిల్లాలో కియా కార్ల ప్రొడక్షన్‌ ట్రయల్‌ రన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరు నెలల్లోగా మార్కెట్‌లోకి కియా కార్లను విడుదల చేస్తామన్నారు....

అనంతపురం జిల్లాలో కియా కార్ల ప్రొడక్షన్‌ ట్రయల్‌ రన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరు నెలల్లోగా మార్కెట్‌లోకి కియా కార్లను విడుదల చేస్తామన్నారు. కియా మోటార్స్‌ ఇండియా ఎమ్‌డీ కూక్‌ హయూన్‌ షిమ్‌‌తో కలిసి ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన సీఎం ఏపీని ఆటోమొబైల్‌ హబ్‌గా తయారు చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కియా కార్ల పరిశ్రమ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం తెలిపారు.

పరిశ్రమలకు అనంతపురం కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందని, రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. కియా మోటార్స్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించిన సీఎం తక్కువ సమయంలో కియా కారు మార్కెట్‌లోకి రాబోతుందన్నారు. ఆరు నెలల్లో కియాకు నీరు అందించామని, కియా రాక ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసిందని చంద్రబాబు కొనియాడారు.

ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ తయారవుతోందని, రాష్ట్రానికి సుజుకి, అశోక్‌ లేలాండ్‌, అపోలో సంస్థలు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో రాయలసీమ రత్నాల సీమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కియ లాంటి పరిశ్రమలు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. కియా కార్ల ప్రొడక్షన్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు కియా మోటార్స్‌ ఇండియా ఎమ్‌డీ కూక్‌ హయూన్‌ షిమ్‌‌తో కలిసి కియా కార్‌ను డ్రైవ్‌లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories