logo

వైసీపీలో దగ్గుబాటి చేరికపై చంద్రబాబు స్పందన

వైసీపీలో దగ్గుబాటి చేరికపై చంద్రబాబు స్పందన

జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీపై సీఎం చంద్రబాబు స్పందించారు. అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరుతున్నారని విమర్శించారు. ఆర్ఎస్‌ఎస్‌ మొదలు అన్ని పార్టీల ప్రదక్షిణలు చేసిన దగ్గుబాటి దంపతులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ నుంచి బీజేపీ ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని అన్నారు. వీరి అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రదిష్ట తెస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, అవకాశవాదులంతా వైసీపీ గూటికి చేరారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

లైవ్ టీవి

Share it
Top