logo
తాజా వార్తలు

కేసీఆర్‌ మిడిల్‌ మోడీ.. జగన్‌ జూనియర్‌ మోడీ

కేసీఆర్‌ మిడిల్‌ మోడీ.. జగన్‌ జూనియర్‌ మోడీ
X
Highlights

కేసీఆర్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కేసీఆర్ వాడిన భాష అసభ్యంగా ఉందని హుందాతనం లేకుండా మాట్లాడారని అన్నారు. మోడి, కేసీఆర్ కలిసి పోటీ చేసుకోండి మాకు అభ్యంతరం లేదన్నారు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని అన్నారు. హోదాపై కేసీఆర్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

కేసీఆర్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కేసీఆర్ వాడిన భాష అసభ్యంగా ఉందని హుందాతనం లేకుండా మాట్లాడారని అన్నారు. మోడి, కేసీఆర్ కలిసి పోటీ చేసుకోండి మాకు అభ్యంతరం లేదన్నారు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవచ్చని అన్నారు. హోదాపై కేసీఆర్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడటమేంటన చంద్రబాబు ప్రశ్నించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. నోరుందని పారేసుకోకూడదని హ‍తవు పలికారు. ఉద్యమసమంలో కెసిఆర్ పొత్తు పెట్టుకోలేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాననలేదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తుపెట్టుకోవచ్చు అని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడు ప్రజలకోసమే పనిచేసే వ్యక్తినని ఎవరి బేదిరిపులకు భయపడే వ్యక్తినికాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వచ్చి పోటీ చేసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్‌ మిడిల్‌ మోడీ అయితే, వైయస్ జగన్‌ జూనియర్‌ మోడీ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

Next Story