Top
logo

అసెంబ్లీకి రానప్పుడు జీతాలెందుకు తీసుకుంటున్నారు

అసెంబ్లీకి రానప్పుడు జీతాలెందుకు తీసుకుంటున్నారు
X
Highlights

అసెంబ్లీకి రానివాళ్లు జీతాలెందుకు తీసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ...

అసెంబ్లీకి రానివాళ్లు జీతాలెందుకు తీసుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని, పార్లమెంటులో సమస్యలపై పోరాడకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు. నాయకుడంటే సరైన సమయంలో స్పందించాలని అన్నారు సీఎం. ఈ ఏడాది చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. జూన్‌లో గ్రావిటీ ద్వారా నీళ్లిస్తామని ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్ధవంతమైన నీటి విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు.

Next Story