కేటీఆర్‌‌ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

కేటీఆర్‌‌ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన చంద్రబాబు
x
Highlights

ఏపీలో టీడీపీ నూటికి నూరు శాతం ఓడిపోతుందన్న కేటీఆర్ కామెంట్స్‌పై చంద్రబాబు ఫైరయ్యారు. మోడీ, కేసీఆర్‌, జగన్ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని హెచ్చరించారు....

ఏపీలో టీడీపీ నూటికి నూరు శాతం ఓడిపోతుందన్న కేటీఆర్ కామెంట్స్‌పై చంద్రబాబు ఫైరయ్యారు. మోడీ, కేసీఆర్‌, జగన్ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని హెచ్చరించారు. జగన్ సీఎం అవుతాడని కేటీఆర్ అంటున్నారని, కానీ తన దగ్గర జగన్ కుప్పిగంతులు పనిచేయవన్నారు. బీజేపీ-టీఆర్‌ఎస్‌-వైసీపీకి దమ్ముంటే తమ ముసుగు తీసి కలిసి పోటీ చేయాలని సవాలు విసిరారు.

ఢిల్లీలోనే కాదు విజయవాడ గల్లీలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరని, వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం దారుణంగా ఓడిపోవడం ఖాయమంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం ఘాటుగా రియాక్టయ్యారు. మోడీ, కేసీఆర్‌, జగన్ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని హెచ్చరించారు.

ఏపీలో ఏమీ అభివృద్ధి జరగలేదని, అంతా గ్రాఫిక్స్ అంటున్నారని, అయితే ముందుగా నమూనాలు వచ్చిన తర్వాతే భవనాలు వస్తాయని గుర్తుచేశారు. జగన్ సీఎం అవుతాడని కేటీఆర్ అంటున్నారని, కానీ తన దగ్గర జగన్ కుప్పిగంతులు పనిచేయవన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని పారిశ్రామికవేత్తలను వ్యాపారులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేంద్రం ఐటీ దాడులు చేయించి భయపెడుతోందన్నారు.

ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని మోడీని నిలదీశానన్న చంద్రబాబు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రధానిని నిలదీయాలని పిలుపునిచ్చారు. చీకటి రాజకీయాలు చేయొద్దన్న చంద్రబాబు బీజేపీ-టీఆర్‌ఎస్‌-వైసీపీకి దమ్ముంటే తమ ముసుగు తీసి కలిసి పోటీ చేయాలని సవాలు విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories