సీఎం జగన్ హామీ : ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు

సీఎం జగన్ హామీ : ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
x
Highlights

ఆగస్టు 15వ తేదీ లోపు గ్రామాల్లో గ్రామ వలంటీర్లుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు వైఎస్ జగన్. ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను...

ఆగస్టు 15వ తేదీ లోపు గ్రామాల్లో గ్రామ వలంటీర్లుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు వైఎస్ జగన్. ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తామన్నారు. సేవ చేయలనుకునే వారికి వలంటీర్‌గా జాబు ఇచ్చి 5 వేల రూపాయల జీతం అందిస్తామన్నారు జగన్. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ లబ్దిదారుల ఇంటికి నేరుగా 'డోర్ డెలివరీ' చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో లంచాలు లేని పరిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికీ అందకపోయినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా ఫిర్యాదు చేసేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories