మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌

మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌
x
Highlights

మంత్రివర్గ కూర్పులో సీఎం జగన్‌ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య సమతూకం పాటించారు. ఒకేసారి 25మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ఆయన పార్టీకి మద్దతుగా...

మంత్రివర్గ కూర్పులో సీఎం జగన్‌ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య సమతూకం పాటించారు. ఒకేసారి 25మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న ఆయన పార్టీకి మద్దతుగా నిలిచిన వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల్లో ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎంల పదవులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన మంత్రిమండలి కొలువుదీరుతోంది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన 25మంది ఎమ్మెల్యేలతో గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*విశాఖపట్నం జిల్లాకు చెందిన ముత్యంశెట్టి శ్రీనివాసరావు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ-బీసీ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ-మాల) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు (క్షత్రియ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత (ఎస్సీ-మాదిగ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు (కమ్మ) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*కృష్ణా జిల్లాకు చెందిన పేర్ని నాని (కాపు) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

*కృష్ణా జిల్లాకు చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య) మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories