డేటా చోరీ కేసులపై ఏపీ కేబినెట్‌లో చర్చ

డేటా చోరీ కేసులపై ఏపీ కేబినెట్‌లో చర్చ
x
Highlights

సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డేటా చోరీ వ్యవహారంపై వాడివేడి చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై...

సుదీర్ఘంగా కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన డేటా చోరీ వ్యవహారంపై వాడివేడి చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ వేధింపులపై సీఎం నేతృత్వంలో భేటీ అయిన మంత్రులు విస్తృతంగా చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిలు పడినా ఇవ్వాల్సినవి ఇవ్వక పోగా మళ్ళీ మనపైనే నిందలు వేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు.విద్యుత్ బకాయిలు పెండింగ్ పెట్టడంతో పాటు పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయడం, ఆస్తుల పంపిణీకి సహకరించక పోవడం వంటివి చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. వివాదాల్ని కేవలం కోర్టులకే వదిలేయకుండా రావాల్సిన రాబట్టాలని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories