logo

బీజేపీ మౌనం వ్యూహాత్మకమా?

బీజేపీ మౌనం వ్యూహాత్మకమా?

ఏపీలో అన్నీ రాజకీయ పార్టీలు ప్రచారంలో ముందున్నాయి. ఎన్నికల కోడ్‌ రాకముందే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. కానీ కమలం నేతలు మాత్రం వెనుకంజలోనే ఉన్నారు. కేవలం ట్విట్టర్‌ వేదికగా కాలక్షేపం చేస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లడం పట్ల ఆలస్యం కనబరుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికల సైరన్‌ మోగనుంది. ఇప్పటి వరకూ దాదాపు అన్నీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జెట్‌ స్పీడులో దూసుకుపోతున్నాయి. ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లి మైకులు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇందుకు భిన్నంగా ట్విట్టర్‌ వేదికగానే తన గొంతు వినిపిస్తుంది.

2014లో అధికారం చేపట్టిన బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో స్థానికంగా అనేక పరిణామాలు ఎదుర్కొంటోంది. క్రమంగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌కి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ప్రస్తుతం బీజేపీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ట్విట్టర్‌లో ఏ టైమ్‌లో అయినా స్పందించే నేతలుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష‌్మీనారాయణ, ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు ముందంజలో ఉంటారు. కానీ ప్రచారంలో మాత్రం దూకుడు పెంచలేదు. ట్విట్టర్‌లో మాత్రం ప్రచారంలో ముందున్న కమలం నేతలు ప్రజల్లోకి వెళ్లడం పట్ల ఆలస్యం చేస్తున్నారు అనే విమర్శ వినిపిస్తుంది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం సెంటిమెంట్‌గా తిరుపతి నుంచి ప్రచారం ప్రారంభిస్తామని చెప్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి దిగుతామంటున్న బీజేపీ నేతలు ఇంత లేటుగా ప్రచారం ప్రారంభిస్తే ఎలా అంటూ ఆ పార్టీ అభిమానులు, సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇకానైనా ట్విట్టర్‌పై పెట్టిన ఫోకస్‌ ప్రత్యక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లే విషయంలో పెడితే బాగుంటుందని కోరుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top