logo

విశాఖ రైల్వే జోన్ గ్యారెంటీ అట

విశాఖ రైల్వే జోన్ గ్యారెంటీ అట
Highlights

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి అమరావతికి చేరుకున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ...

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అర్ధరాత్రి అమరావతికి చేరుకున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ నేతలు. రాష్ట్ర విభజనలో ఉన్నవి, లేనివి ఎన్నో సంస్థలను కేంద్రం ఏపీలో నెలకొల్పితే చంద్రబాబు కేంద్రంపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో నిన్న కేంద్రమంత్రి పీ‍యూష్‌గోయల్‌ని కలిసిన బీజేపీ నేతలు విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాతోపాటు రైల్వే జోన్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, నిజంగా చిత్తశుద్ది ఉంటే విభజన సమయంలో బిల్లులో ఎందుకు పెట్టలేని ప్రశ్నించారు. పెద్దఎత్తున రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తుందని, అందరూ గ్రహించాలని కోరారు.

ఏపీకి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఢిల్లీలో రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. రైల్వే జోన్‌ ఆవశ్యకతను పీయూష్‌ గోయల్‌కు వివరించామన్నారు. 2014 నుంచి కేంద్రం ఏపీ అభివృద్ధికి సహకరిస్తోందని అయినా చంద్రబాబు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని, విభజన హామీలను కేంద్రం 90 శాతం అమలు చేసిందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం అడ్డుపడుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 100 శాతం నిధులు ఇస్తోందన్నారు వారు స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top