Top
logo

టీడీపీకి చుక్కలు చూపిస్తా.. భీమవరంలో పవన్ వార్నింగ్

టీడీపీకి చుక్కలు చూపిస్తా.. భీమవరంలో పవన్ వార్నింగ్
Highlights

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకు కులమత భేదాలు లేవని ...

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకు కులమత భేదాలు లేవని మానవత్వమే మాత్రమే ఉందని జనసేనాని స్పష్టం చేశారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. జనసేన కార్యక్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వచ్చిన పవన్ కల్యాణ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన సొంత జిల్లా నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. గొడవలు లేని భీమవరాన్ని తయారు చేస్తానని నామినేషన్ తర్వాత పవన్ హామీ ఇచ్చారు. తాను నడిచే నాయకుడిని కాదని, ప్రజల సేవకుడినని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా నిన్న (గురువారం) గాజువాకలో కూడాతో నామినేషన్ వేశారు. భీమవరం అసెంబ్లీ స్థానంతో పాటు గాజువాకలోనూ పోటీచేస్తున్నారు.

Next Story