Top
logo

ఎన్నికల ముందు జనసేనకు మరో కోలుకోలేని షాక్..

ఎన్నికల ముందు జనసేనకు మరో కోలుకోలేని షాక్..
X
Highlights

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒవైపు ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండటంతో పార్టీ అధినేతలు ప్రచారంలో...

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒవైపు ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండటంతో పార్టీ అధినేతలు ప్రచారంలో దూకుడుపెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుండి మరోక పార్టీలోకి వలసలు సాగుతూనే ఉన్నాయి. జనసేనకు పలువురు కీలకనేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా జనసేన పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ జనసేనకు గుడ్‌ బై చెప్పేశారు. మార్చి 18న అధికార పార్టీకి గుడ్ బై చెప్పిన డీవై దాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మక్షంలో కండువా కప్పుకున్నారు.

కాగా తాను పామర్రు నుంచి మాత్రమే పోటీచేస్తానని పవన్‌కు చెప్పానన్నారు. జనసేనాని తనకు సీనియర్‌ నేతనని కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రు సీటు బీఎస్పీకి ఇచ్చామని వాళ్లతో మాట్లాడుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని డీవై దాస్‌ అసంతృప్తికి లోనయ్యారు. తనకు టిక్కెట్ కేటాయించకపోవడంలో టీడీపీ హస్తం ఉన్నట్లు భావిస్తున్నానని అన్నారు. అందుకే జనసేన పార్టీ నుండి బయటికి వచ్చేశానని మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ మీడియాకు వివరించారు.

Next Story