బ్రేకింగ్: రాజన్న సిరిసిల్లలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

బ్రేకింగ్: రాజన్న సిరిసిల్లలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
x
Highlights

తెలంగాణలో ఇంటర్మిడియట్‌ ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి విద్యార్థులు ఫెయిల్ అయ్యామని విద్యార్థినీ, విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం...

తెలంగాణలో ఇంటర్మిడియట్‌ ఫలితాలు వెలువడిన దగ్గరి నుండి విద్యార్థులు ఫెయిల్ అయ్యామని విద్యార్థినీ, విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికి తెలంగాణలో విద్యార్ధిని, విద్యార్థులు సూమారు 23 మంది విద్యార్థులు ప్రాణాలను వదులుకున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్లజిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డింది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట (మం) వట్టిమల్ల గ్రామానికి చెందిన కామిండ్ల లావణ్య అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంటర్‌లో ఫెయిలై కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

ఇక మరోవైపు ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రతిపక్షాల ఆందోళనలు మరింత ఉధృతం చేశాయి. త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ అందజేసిన తర్వాత కూడా బాధ్యులపై ఎలాంటి చర్యల్లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయం దగ్గర ధర్నాకు అఖిపక్షం దిగింది. దీంతో ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్ధి నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నడిరోడ్డుపైనే విద్యార్ధులను ఇష్టానుసారం లాగేసిన పోలీసులు బలవంతంగా వ్యాన్లలో తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories