ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. 20మందికి తీవ్రగాయాలు
x
Highlights

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీ కొట్టింది....

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల నుంచి చెన్నూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories